3 రోజుల క్రితం తమిళనాడులోని కర్నూరులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో సీపీఐ, సీపీఎం, మాదిగ దండోరా నాయకులు నిరసన తెలిపారు. మార్కెట్ కూడలి నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాలు కూల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతంలో తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ ర్యాలీ - demolish
తమిళ నాడులోని కర్నూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేయటాన్ని నిరసిస్తూ వామపక్షపార్టీలు, మాదిగ దండోర నాయకులు మైదుకూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ ర్యాలీ