కడప జిల్లా మైదుకూరు ఎర్ర చెరువు సమీప బావిలో అధ్యాపకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానిక డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు. ఐదు నెలల కిందటే కళాశాలలో చేరారు. సోమవారం విధులకు హాజరైన అనంతరం కనిపించకుండా పోయారు. శ్రీనివాసులు వినియోగిస్తున్న ద్విచక్ర వాహనం బావి సమీపంలో ఉండటాన్ని.. కళాశాలలోనే పనిచేస్తున్న మరో అధ్యాపకుడు గుర్తించారు. కళాశాల సిబ్బందితో కలిసి సమీపంలో వెతికారు. శ్రీనివాసులు బావిలో శవమై ఉండటాన్ని గమనించిన వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులకు సమాచారం అందించారు. అయితే శ్రీనివాసులు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా బంధువులు వాపోతున్నారు.
బావిలో అధ్యాపకుడి మృతదేహం..అసలేం జరిగింది..? - కడప జిల్లాలో అధ్యాపకుడి అనుమానస్పద మృతి తాజా వార్తలు
సోమవారం విధులకు హాజరైన అనంతరం కనిపించకుండా పోయిన.. కళాశాల అద్యాపకుడు బావిలో శవమై కనిపించటం.. కడప జిల్లా మైదుకూరులో అలజడి రేపింది. కళాశాలలోనే పనిచేస్తున్న మరో అధ్యాపకుడు.. శ్రీనివాసులు వినియోగిస్తున్న ద్విచక్ర వాహనం బావి సమీపంలో ఉండటాన్ని గమనించారు. అనంతరం బావిలో మృతదేహాన్ని గుర్తించారు.
కాలువాలో లెక్చరర్ మృతదేహం