ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం ఈ లంకమల క్షేత్రం
ఎటు చూసినా ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్లు.. జల జల జాలువారే జలపాతాలు.. పక్షుల కిలకిలా రావాలు.. ఆధ్యాత్మికతను పెంపొందించే క్షేత్రాలు.. ఇవి అన్ని లంకమల క్షేత్రం సొంతం. ఇక్కడి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతారు. కడప జిల్లా బద్వేలుకు 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో లంకమల క్షేత్రం ఉంది. ఇక్కడ పార్వతీ సమేతంగా వెలసిన లంకమల్లేశ్వర క్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో ప్రపంచంలో అంతరించి పోయింది అనుకున్న కలివికోడి జాడ ,అరుదైన హనీ బాడ్జర్ ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
lankamala-kshetra-is-home-to-many-natural-beauties
.