నిలకడగా రాజోలి ఆనకట్ట నీటి ప్రవాహం
కడప, కర్నూలు జిల్లా సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కృష్ణా జలాల ప్రవాహం నిలకడగానే ఉంది. 2900 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 500 క్యూసెక్కులు కడప జిల్లాలోని కేసీ కాలువలోకి మళ్లించారు.
water flow
కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కృష్ణాజలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో ఎస్కేప్ ఛానల్ ద్వారా కొంత నీరు కుందు నదిలోకి మళ్ళించారు. రాజోలి ఆనకట్ట వద్ద 2,900 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... 500 క్యూసెక్కులు కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు కోసం మళ్లించారు. మిగిలిన 2400 క్యూసెక్కుల నీరు దిగువ కుందు నదిలోకి చేరుతోంది. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.