కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లెలో.. అక్రమంగా కర్ణాటక మద్యం తరలించి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గంగన్న అనే వ్యక్తి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి.. అధిక ధరలకు పట్టణంలో అమ్ముతున్నట్లు సమాచారం రావటంతో.. పోలీస్ సిబ్బంది దాడులు చేశారు.
అతని వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 238 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంగన్నకు పెళ్లిమరి మండలం గుర్రాల చింతపల్లికి చెందిన వ్యక్తి కర్ణాటక నుంచి మద్యం తెచ్చి ఇచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.