కూరగాయల లారీలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 145 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వేంపల్లికి చెందిన రాహుల్ ఉద్దీన్, సుంకేసుల బాబు అనే ఇద్దరు... కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి ఒక్కో బాటిల్‌పై రూ.600 నుంచి రూ.800 వరకు లాభాలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ హెచ్చరించారు.
కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - కడప జిల్లా తాజా మద్యం వార్తలు
కర్ణాటక మద్యాన్ని కూరగాయల లారీలో తీసుకువచ్చి వేంపల్లిలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 145 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కడప జిల్లాలో కర్ణాటక మద్యం పట్టివేత