కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం నగర పంచాయతీలో కుక్కల విహారం ఎక్కువైంది. వాటి వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుక్కలను పట్టించేందుకు మున్సిపల్ వారు నెల్లూరు నుంచి కొంతమందిని పిలిపించారు. ఐదు నెలల నుంచి దాదాపు 300 వరకు కుక్కలను పట్టుకున్నామని.. డబ్బులు మాత్రం ఇవ్వలేదని కమిషనర్ కార్యాలయం వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 45 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని.. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.
కుక్కలను పట్టించారు.. డబ్బులు మాత్రం చెల్లించలేదు
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వాటిని పట్టించిన వారికి డబ్బులు ఇవ్వటం లేదని కమిషనర్ కార్యాలయం వద్ద బాధితులు వాపోతున్నారు.
బాధితులు