కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 411వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన 411 కలశాలకు బ్రహ్మంగారి వారసులైన మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు కలశాలతో మాడవీధుల గుండా పార్కులో ఏర్పాటు చేసిన బ్రహ్మంగారి శిలా విగ్రహం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. శిలా విగ్రహానికి స్వయంగా పీఠాధిపతి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 411వ జయంతి ఉత్సవాలు - పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి న్యూస్
కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 411వ జయంతిని కడప జిల్లాలో వైభవంగా నిర్వహించారు. బ్రహ్మంగారి విగ్రహానికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతులు క్షీరాభిషేకం చేశారు.
రాజంపేటలో...
రాజంపేటలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి జయంతి మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ధ్వజస్తంభ పూజలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, సహస్రనామార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోవిందమ్మ సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి పంచామృతాభిషేకాలను వేద పండితుడు అరుణ్ కుమార్ స్వామి నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు