ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 4, 2020, 3:23 PM IST

ETV Bharat / state

లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలంటూ తెదేపా డిమాండ్

వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, టిడ్కో ఇళ్లు పేదలకు చేరకుండా అడ్డుకుంటోందని.. కడప తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి ఆరోపించారు. ప్రజలు 5 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చి డిపాజిట్లు కట్టగా.. రివర్స్ టెండరింగ్ పేరిట రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్లు
టిడ్కో ఇళ్లు

పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని.. కడప పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం 19,232 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటికే 3 వేలకుపైగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. డిపాజిట్లు కట్టిన వారికీ ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 5 రూపాయల వడ్డీకి అప్పుచేసి మరీ జమ చేస్తే.. జగన్ సర్కారు లాగేసుకోవాలని చూస్తోందని విమర్శించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. రాష్ట్రంలోనే అత్యధిక టిడ్కో ఇళ్లను కడప జిల్లాకు కేటాయించిన ఘనత తెదేపాదని ఆయన తెలిపారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. రివర్స్ టెండరింగ్ పేరిట ఇళ్లను రద్దు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆ గృహాలను పేదలకు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:వంద రోజులకు చేరిన ఏపీఎంసీ వర్కర్ల సామూహిక దీక్షలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details