ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న కడప ఆర్టీసీ ఉద్యోగులు

కడప జిల్లా పరిధిలో.. ఆర్టీసీ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. ఓ వృద్ధుడు బస్సులో చనిపోగా.. తర్వాతి బస్టాండ్​ వరకు మృతదేహాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లారు. అనంతరం ఆర్టీసీ అధికారులు స్పందించి.. ఓ స్వచ్ఛంద సంస్థ వాహనంలో సొంతూరుకి తరలించారు.

kadapa-rtc-employees-showed-humanity
kadapa-rtc-employees-showed-humanity

By

Published : Mar 2, 2021, 1:24 PM IST

వారం క్రితం తూర్పు గోదావరి జిల్లాలో దంపతులు బస్సులో ప్రయాణిస్తుండగా దారిలో భర్త చనిపోయాడు. వెంటనే... డ్రైవర్, కండక్టర్ బస్సులో నుంచి కిందికి దించేసిన సంఘటన అందరికీ తెలిసిందే. తాజాగా.. కడప జిల్లాలోనూ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ వృద్ధుడు ప్రాణం విడిచాడు. ఈ సారి మాత్రం.. ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు.

వనిపెంటలో ఎర్రన్న, సాలమ్మ అనే వృద్ధ దంపతులు జీవిస్తున్నారు. ఎర్రన్న అనారోగ్యం బారిన పడగా.. సోమవారం భార్యభర్తలిద్దరూ ఆర్టీసీ బస్సులో కడప ఆసుపత్రిలో చూపించుకునేందుకు బయలుదేరారు. దారిలోనే ఎర్రన్న చనిపోయాడు. విషయం ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్​కు తెలిసింది. ఎర్రన్న భార్యకు ధైర్యం చెప్పిన డ్రైవర్, కండక్టర్.. బస్సులోనే మృతదేహాన్ని కడప ఆర్టీసీ బస్టాండ్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఆర్టీసీ భద్రతా సిబ్బంది మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వాహనంలో మృతదేహాన్ని సొంత ఊరికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details