ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంపీలకు వినతి పత్రాలు - విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంపీలకు వినతి పత్రాలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు కడప ప్రజా సంఘాల అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి వెల్లడించారు. విశాఖ ఉక్కు సాధించుకునే వరకు పోరాడతామన్నారు.

petitions to MPs
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంపీలకు వినతి పత్రాలు

By

Published : Mar 12, 2021, 8:15 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13, 14 తేదీలలో ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు కడప ప్రజా సంఘాల అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు కడపలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 15వ తేదీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపటనున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ఆందోళన ద్వారానే విశాఖ ఉక్కును సాధించుకోగలమని వివరించారు. 32 మంది తమ ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును.. ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details