కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఉరుసు ఉత్సవాలు జరిపించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రేపు సాయంత్రం మాలింగు షాను పీఠంపై కూర్చోబెట్టనున్నారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రభుత్వ లాంఛనాలతో గంధం సమర్పిస్తారు.
చివరి రోజు నిర్వహించే ఊరేగింపును కరోనా దృష్ట్యా రద్దు చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దర్గా ఆవరణలో కంట్రోల్ రూంతో పాటు మహిళా మిత్ర, పోలీస్ కార్యదర్శులను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పత్యేక నిఘా ఏర్పాటు చేశామని స్థానిక డీఎస్పీ తెలిపారు.