ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 9:54 PM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి..యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?

విద్యుదాఘాతానికి గురైన విద్యార్థి మృతికి.. కడప గ్లోబల్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేవరకు శవపరీక్షకు అనుమతించమని డిమాండ్ చేశారు.

electric shock
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కడప గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో మొదటి ఏడాది విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని.. విద్యార్థి సంఘ నాయకులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్పందించి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకు శవపరీక్షకు అనుమతించమని బైఠాయించారు. అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

సిద్ధవటం మండలానికి చెందిన గణేష్.. గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో మొదటి ఏడాది చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో ఈరోజు సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా.. మృతుడు బంతి కోసం వెళ్ళాడు. సమీపంలోని నీటి గుంటలో కాలు పెట్టగానే.. అక్కడికక్కడే మృతిచెందాడని మిత్రులు తెలిపారు. సహచరులు హుటాహుటిన వచ్చి పరిశీలించగా.. అక్కడ విద్యుత్ తీగలు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details