ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆమె మృతికి కారణమేంటో తెలియలేదు.. వ్యాక్సిన్​పై అపోహలు వద్దు' - కడప కలెక్టర్ హరికిరణ్ న్యూస్

కరోనా వ్యాక్సిన్​పై భయాందోళనలు కలిగించేలా... ఎటువంటి వార్తలు ప్రచారం చేయవద్దని కడప కలెక్టర్.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్త మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. వైద్య బృందం ఆమె మృతికి గల కారణాలు నిర్థరణ చేసే వరకు వేచి ఉండాలన్నారు.

collector comments on covid vaccine
ఆమె మృతికి గల కారణాలు ధ్రువీకరించలేదు

By

Published : Feb 20, 2021, 1:52 PM IST

కడప జిల్లా పులివెందులలో అంగన్వాడీ కార్యకర్త నారాయణమ్మ... మృతికి గల కారణాలు వైద్య బృందం ఇంకా నిర్థరించలేదని కలెక్టర్ సి హరికిరణ్ వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన నారాయణమ్మ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుందనీ.. అనంతరం గంట పాటు ఆమెను అబ్జర్​వేషన్​లో ఉంచారని తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్న కారణంగానే ఇంటికి పంపిచినట్లు వివరించారు.

ఈ నెల 18న నారాయణమ్మ మృతి చెందిందని... ఆమె మరణానికి వ్యాక్సినే కారణం అంటూ వస్తున్నాయని అన్నారు. ఆమె మరణానికి గల కారణాలను నిర్థరించేందుకు వైద్య బృందం ఉందని... ఆ కారణాలు నిర్థరించేంత వరకు అవాస్తవాలు ప్రచారం చేయవద్దని చెప్పారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ వికటించిన కారణంగానే ఆమె మృతి చెందిందని.. నారాయణమ్మ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details