ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్ట్రాంగ్ రూములను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎమ్​లను భద్రపరచిన స్ట్రాంగ్​ రూములను గత నెల చివరన పరిశీలించిన కడప కలెక్టర్ మరోసారి తనిఖీలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్​కి వెళ్లి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.

సీసీ కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న కలెక్టర్

By

Published : May 9, 2019, 10:58 PM IST

ఈవీఎమ్​లు జాగ్రత్త
కడప శివారులోని కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ ​రూముల్లో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కలెక్టర్ హరికిరణ్ మరోసారి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, ఆర్డీవో మలోలాతో కలిసి కలెక్టర్ స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేశారు. ఈనెల 23న జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్​సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడే జరగనుంది. ఈవీఎంలు భద్రపరచిన భవనాలు భారీ వర్షం వచ్చినా తడిసి పోకుండా భారీ టార్పాలిన్ కవర్లను కప్పారు. అవి ఏమేరకు భద్రంగా ఉన్నాయని కలెక్టర్ పరిశీలించారు. వీటితోపాటు అన్ని గదుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీలు పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులను ఆరా తీశారు. సీసీటీవీలు ఉన్న కమాండ్ కంట్రోలు కేంద్రంలోకి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీల్ ను పరిశీలించి... పహారా కాస్తున్న సీఎర్పీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈనెల 23వ తేదీ వరకు నిఘా పటిష్ఠంగా ఉండాలని... పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details