కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం కొత్తపల్లి ఎస్సీ కాలనీలో నివర్ తుపాను సమయంలో నీరు చేరింది. కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. నీరు తగ్గలేదని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నామమాత్రంగా పనులు చేశారని స్థానికులు అంటున్నారు. నీరు తగ్గకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇళ్లలో నీరు చేరడంతో దగ్గర్లోని చర్చి ఆవరణంలో తలదాచుకుంటున్నారు.
నీళ్లలోనే రామచంద్రపురం...అధికారులకు పట్టని వైనం - ఏపీ తాజా వార్తలు
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం కొత్తపల్లి ఎస్సీ కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నివర్ తుపానుతో కురిసిన వర్షాలకు కాలనీల్లో నీరు చేరింది. ఇళ్లలోకి సైతం నీరు రావడంతో దగ్గర్లోని ఓ చర్చిలో స్థానికులు తలదాచుకుంటున్నారు. అధికారులు, నాయకులు వచ్చి చూసి పోతున్నారే కానీ సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ramchandrapuram colony
వర్షాలు తగ్గి ఇన్ని రోజులైనా నీటి మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపించారు. నీరు దుర్వాసన రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. అధికారులు, నాయకులు వస్తూ పోతున్నారే తప్ప సమస్యలు తీర్చే నాథుడే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :'ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలి'