ప్రభుత్వ భూములను పెద్దలు ఆక్రమించుకుంటే పట్టించుకోని రెవెన్యూ అధికారులు... పేదల ఇళ్లను మాత్రం నిర్ధాక్షిణ్యంగా కూల్చారని కాంగ్రెస్, సీపీఐ నేతలు మండిపడ్డారు. కడప ఎన్టీఆర్ నగర్లో కూల్చిన ఇళ్ల స్థలాలను పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పరిశీలించారు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చడం ఏంటని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తానని తన నవరత్నాల్లో చెప్పిన జగన్.. ఇపుడేమో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నాడని మండిపడ్డారు.
రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. పేదల ఇళ్లను పరిశీలించిన సీపీఐ బృందం.. వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించిన వారు, ప్రభుత్వం భూమి కబ్జా చేసినవారు, మురికి కాల్వలు ఆక్రమించి థియేటర్లు నిర్మించిన వారిపై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు.