అధ్వానం.. బస్సులు ఆగే ప్రదేశం ఎర్రగుంట్ల మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా వసతుల కల్పనలో మాత్రం ఏ మార్పు రాలేదు. ముఖ్యంగా వందల మంది వచ్చే బస్టాండ్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ప్రధాన రహదారులు రేణిగుంట గుత్తి జాతీయరహదారి, వేంపల్లి ప్రొద్దుటూరు ప్రధాన రహదారి ఈ పట్టణం మీదుగా వెళ్తున్నాయి. ప్రధానమైన బస్సు జంక్షన్‌గా ఎర్రగుంట్ల ఉంది. అలాంటి బస్టాండ్‌లో కనీస వసతుల్లేవు. కంపు కొట్టే బస్టాండ్ మీదుగా పయణిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆరుబయటే మూత్రవిసర్జన చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నా పట్టించుకున్న వారు లేరు. బస్టాండ్ పట్టణం మధ్యలో ఉన్నందున నిత్యం ట్రాఫిక్ అగిపోతోంది. కాలుష్యం చెప్పనక్కర్లేదు. బస్టాండ్ వచ్చే ప్రయాణికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఇదీ ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.