కడప జిల్లా ప్రొద్దుటూరులోని దువ్వూరు క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 144 ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు మైదుకూరు రోడ్డులోని టైర్ల దుకాణంలో తెలంగాణ మద్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు... తనిఖీలు చేపట్టారు. 179 మద్యం సీసాలు సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
కడప జిల్లాలో తెలంగాణ మద్యం... ముగ్గురి అరెస్టు - కడప జిల్లాలో అక్రమ మద్యం వార్తలు
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం... మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. కడప జిల్లాలో రెండు చోట్ల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.
కడప జిల్లాలో తెలంగాణ మద్యం... ముగ్గురు అరెస్టు