కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. అనుమతులు లేకుండా తుపాకులు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 1,219 తుపాకులను... డీఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమక్షంలో నిర్వీర్యం చేశారు. కడప పోలీసు మైదానంలో నాటు తుపాకులన్నిటినీ రోడ్డు రోలర్‌తో తొక్కించారు. వాటిని ఏఆర్ మైదానంలో కొంతకాలం పాతి పెడతామని డీఐజీ తెలిపారు. ఎవరిదగ్గరైనా లైసెన్సు పొందని ఆయుధాలు ఉంటే వెంటనే పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎవరివద్దా తుపాకులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ తనిఖీల్లో బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.