కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గిలేటిపల్లె వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 4,950కిలోల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఒక ఆటో స్వాధీనం చేసుకుని.. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - illegal transport of ration rice news
చింతకొమ్మదిన్నె మండలం బుగ్గిలేటిపల్లె వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. వారికి అందిన సమాచారంతో దాడులు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పురుషోత్తం పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఆరుగురు వ్యక్తులు.. నివాసాల వద్దకు వెళ్లి చౌక బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేసి వాటిని బియ్యం మిల్లులకు కిలో రూ.20 నుంచి 30కి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పురుషోత్తం పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఏఆర్ పోలీసులకు పున:పరిశీలన తరగతులు