కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామం వద్ద ఇసుక నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిమెంటు ఇటుకల నిర్మాణం కోసం అక్రమంగా తరలించిన 30 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా అక్రమంగా తరలించిన 30 ట్రాక్టర్ల ఇసుకను జప్తు చేసినట్లు జమ్మలమడుగు పట్టణ సీఐ మధుసూదన్ రావు తెలిపారు. ఇటుకల కర్మాగారం కూడా దేవాదాయ శాఖ భూముల్లో ఉంది కావున తాహసీల్దారు దృష్టికి తీసుకెళ్తామని సీఐ పేర్కొన్నారు.
అనుమతులు లేని 30 ట్రాక్టర్ల ఇసుక నిల్వలు స్వాధీనం - అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న జమ్మలమడుగు పోలీసులు
అనుమతి లేకుండా అక్రమంగా తరలించిన 30 ట్రాక్టర్ల ఇసుకను జమ్మలమడుగు పోలీసులు సీజ్ చేశారు.
అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్న జమ్మలమడుగు పోలీసులు