కడప జిల్లా పులివెందులకు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కణంపల్లి గ్రామ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 218 మద్యం సీసాలను పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.... ద్రాక్ష లోడుతో వెళుతున్న వాహనంలో అక్రమ మద్యం పట్టు పడిందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సీఐ.సురేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వాహనాన్ని సీజ్ చేసి, నిందితుడు బాబు షన్నుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం పట్టివేత... నిందితుడు అరెస్టు - ఈటీవీ భారత్ తాజా వార్తలు
రాష్ట్రంలో పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా అక్రమ మద్యం తరలింపు కొనసాగుతూనే ఉంది. కర్ణాటక నుంచి కడప జిల్లాలోని పులివెందులకు ద్రాక్ష లోడు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 218 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి, నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత... నిందితుడు అరెస్టు
Last Updated : Jul 12, 2020, 2:02 PM IST