ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త! - భార్య మెడకు వైరును బిగించి హత్య

భార్య ఉద్యోగం చేయటం భర్తకు నచ్చలేదు. ఆమె ప్రతి కదలికను అనుమానించి వేధించాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. అదే ఆ మహిళ పాలిట శాపంగా మారింది.

husband  murdered his wife at proddhutoru kadapa dist
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

By

Published : Nov 7, 2020, 9:33 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. పట్టణంలోని 36వ సచివాలయం 11వ క్లస్టర్​లో స్వర్ణలత(35) అనే మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై భర్త జయరామిరెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించారు. దాంతో అతను ఆగ్రహానికిలోనై భార్య మెడకు వైరును బిగించి హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details