ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తను రోకలిబండతో మోది హత్య చేసిన భార్య - badwelu latest

మద్యం తాగి వచ్చి తనపై, తన పిల్లలపై దాడికి దిగిన భర్తను రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చింది ఓ భార్య. కడప జిల్లా బద్వేలులో జరిగిన ఘటన వివరాలివి.

బద్వేలులో దారుణం... రోకలి బండతో భర్తను హత్య చేసిన భార్య

By

Published : Nov 3, 2019, 8:28 AM IST

భర్తను హత్య చేసిన భార్య
కడప జిల్లా బద్వేలులో దారుణం జరిగింది. మద్యానికి బానిసై వేధిస్తోన్న భర్తను.. అతని భార్య కిరాతకంగా రోకలి బండతో దాడి చేసి హతమార్చింది. బద్వేల్​లోని కొండారెడ్డి నగర్​లో ఉంటున్న ఆంజనేయులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాగుడుకు అలవాటు పడిన ఆంజనేయులు... భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులను వేధించేవాడని సమాచారం. మద్యం సేవించి వచ్చి... భార్య పిల్లలపై కత్తితో దాడికి దిగగా... భరించలేని భార్య నాగలక్ష్మి రోకలి బండ తీసుకుని బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు గమనించి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారి... కడప రిమ్స్​కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details