కడప జిల్లాలో ఈరోజు సాయంత్రం వీచిన పెనుగాలులు, అకాల వర్షం వల్ల రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలి మండలాలలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. వీటిలో ముఖ్యంగా అరటి ఎక్కువ భాగం దెబ్బతినగా స్వల్పంగా మామిడి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి.
ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతున్న రైతులు, సకాలంలో పంట చేతికి వచ్చినా కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. మరో వైపు ఈ అకాల వర్షం వలన ఉద్యాన పంటల రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.