పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లు కడప కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఐదు నెలల నుంచి గ్రీన్ అంబాసిడర్ల జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. అధికారులు రాజకీయాలు చేయకుండా కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి పని భారాన్ని తగ్గించాలని కోరారు.
వేతనాలు చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్ల నిరసన - వేతనాలు చెల్లించాలని డిమాండ్
కరోనా ఆపత్కాలంలో గ్రీన్ అంబాసిడర్లను పొగిడిన ప్రభుత్వాలు.. వారికి వేతనాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. నెలల తరబడి తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రీన్ అంబాసిడర్ల నిరసన