కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో.. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి శత కలశాభిషేకాన్ని వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు వంటి ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు.
వాయుపుత్ర హనుమాన్ కు శత కలశాభిషేకాలు - Grandpa Vaiyaputra Hanuman with centennial remarks
రాజంపేట పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అంజనీపుత్ర హనుమాన్ కు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వైభవంగా వాయుపుత్ర హనుమాన్ కు శత కలశాభిషేకాలు
ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారిని సింధూరం, వడమాల, తమలపాకులతో అందంగా అలంకరించారు. కరోనా కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు.