ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సొంత జిల్లాలో ఎండిపోతున్న పంటలు - కరవు ప్రాంతాలను ప్రకటించని ప్రభుత్వం - జగన్​ మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

Government not Declared Drought Zones in Kadapa District: వర్షభావ పరిస్థితులు తలెత్తి పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోవడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

government_not_declared_drought_zones_in_kadapa_district
government_not_declared_drought_zones_in_kadapa_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 10:02 AM IST

Government not Declared Drought Zones in Kadapa District: రాష్ట్రంలో తూతు మంత్రంగా కరవు మండలాలను ప్రకటించగా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడం తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది. వేల కొద్ది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా ప్రభుత్వం పట్టనట్ల వ్యవహరించడంపై అన్నదాతలు మండిపడ్తున్నారు. సీఎం జగన్​మోహన్​ రెడ్డి స్వయాన మేనమామ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన కనికరం చూపించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం మేనమామ నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలు - కరవు మండలాల ప్రకటనకు సీఎం విముఖత అని ఆరోపణలు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కడప జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. మినుము మాత్రమే కాకుండా ఇతర పంటలైన శనగను సైతం సాగు చేశారు. చివరి దశలో ఉన్న పంటలు.. వర్షాలు కురవకపోవడంతో ఎండిపోతున్నాయి. మినము పంటను సాగు చేయాలంటే ఎకరానికి దాదాపు 20 వేల నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు వివరిస్తున్నారు.

రైతుల సమస్యపై పోరుబాట - పంటలు పరిశీలించిన జనసేన, కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నా

వైఎస్సార్​ కడప జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉండగా.. ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి జగన్​ మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గమైన కమలాపురంలో.. వందల ఎకరాల్లో మినుము పంటను రైతులు వర్షాధారంగా సాగు చేశారు. ఈ నియోజకవర్గంలో అధికంగా కమలాపురం, వల్లూరు, వీఎన్ పల్లె, పెండ్లిమర్రి మండలాల్లో.. దాదాపు 15 వేల ఎకరాల్లో మినుము పంటను సాగు చేశారు. అందులో సుమారు 10వేల ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు అంచనా.

పంటలు ఎండిపోతున్న పట్టించుకునే వారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. ఇప్పుడు కరవు వల్ల నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. మినుముకు మార్కెట్లో మంచి ధర పలకడంతో రైతులు సాగుచేయడానికి ముందుకు వచ్చారు. అయితే కరవు విలయ తాండవానికి తట్టుకోలేకపోయామంటున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయిన ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

కరవు పరిస్థితులపై సీఎం అవాస్తవాలు మాని పొలం బాట పట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

"వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. కరవు వల్ల ప్రభుత్వం ఇన్​పుట్​ సబ్సీడీ, కరవు బృందం వచ్చి చేసే సహాయ చర్యలు కూడా లేవు." -మినుము రైతు, కమలాపురం నియోజకర్గం

"నేను పద్నాలుగు ఎకరాలు మినుము వేశాను. ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టాను. వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా నష్టం వాటిల్లింది." -మినుము రైతు, కమలాపురం నియోజకర్గం

449 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి - కాంగ్రెస్ రైతు గర్జన సభలో నేతలు

నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంట నష్టానికి గురవుతున్నా.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం రైతులను పలకరించిన పాపన పోలేదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, రైతు సంఘం నాయకులు, వామపక్షాలు రైతులను పరామర్శిస్తున్నాయి. ఇంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సీపీఐ నేతలు, రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

"రాష్ట్రంలో దుర్భరమైన కరవు తాండవిస్తోంది. ప్రభుత్వానికి ఇది పట్టడం లేదు. అధికార పార్టీ నేడు బస్సు యాత్రలు చేస్తోంది. బస్సు యాత్రలు కాదు.. కరవు యాత్రలు చేయాలి." -ఓబులేసు, సీపీఐ రాష్ట్ర నాయకుడు

కడప జిల్లాలో ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కరవు పరిస్థితులు ఉన్న మండలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేధిక పంపినా.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి కరవు మండలాల ప్రకటనపై విముఖత చూపారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి.. కరవు మండలాలను ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సీఎం మేనమామ నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలు - కరవు మండలాల ప్రకటనకు సీఎం విముఖత అని ఆరోపణలు

కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details