ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కొవిడ్ కేసులు చూడమని బోర్టులు పెట్టడం సరికాదు'

By

Published : Apr 30, 2021, 7:00 AM IST

రాయచోటిలో ట్రూ నాట్ ల్యాబ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ కేసులు చూడమని బోర్టులు పెట్టడం సరికాదన్నారు. రెమిడెసివర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారనే ఉద్దేశంతోనే విజిలెన్స్ తనిఖీలు చేశారని ఆయన చెప్పారు. అందరికీ ఒక భయం కలగాలన్న ఆలోచనలే తప్ప, ఏ ఒక్కరినీ కించపరిచే దురుద్దేశ్యం లేదన్నారు.

Srikanth Reddy
Srikanth Reddy

ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా కేసులు చూడమని బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వైద్యులకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నారు. రెమిడెసివర్ ఇంజెక్షన్లు బయట మార్కెట్ కు తరలుతున్నాయని.. నిజమైన పేదలకు అవి అందాలన్న లక్ష్యంతోనే విజిలెన్స్ తనిఖీలు చేశారే తప్ప కక్ష్యపూరితంగా కాదన్నారు. కొంతమంది ఆదాయాల కోసం ఇలా వ్యవహరిస్తున్నారన్న సమాచారం ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. పేదలకు ఆరోగ్య సహాయ సహకారాలు అందించాల్సిన సమయంలో చెడ్డ పేరు మూటగట్టుకునే పరిస్థితి ఉందన్నారు. మనో ధైర్యాన్ని నింపాల్సిన వారే వెనకడుగు వేస్తున్నారన్న అపవాదు రానీయకండని ఆయన హితవు పలికారు.మీ సేవలను ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details