కడప జిల్లా బద్వేల్‌కు చెందిన ఓ యువతి సిద్ధవటం పెన్నా నది వద్ద ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న ఎస్సై రమేష్ బాబు... యువతిని రక్షించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అత్యవసర చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఆత్మహత్యకు ఎందుకు యత్నించిందన్న విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఎస్సై - badvel latst suicide news
పెన్నా నదిలో దూకి బద్వేలుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న ఎస్సై విషయాన్ని గుర్తించి... ఆమెను రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.
girl-jumped-into-penna-river-attempt-suicide-but-saved-by-policeman-in-kadapa-district