ఈ నెల 9, 10 తేదీల్లో గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కడప కలెక్టర్ హరి వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకలకు సంస్కృతం- సాహసం అని పేరు పెట్టామని తెలిపారు. తొలి రోజు సినీ కళాకారులు హాజరవుతారని, సాహస కృత్యాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. సెలవు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.