కడప జిల్లా జమ్మలమడుగులోని ఉక్కు పరిశ్రమ కోసం గండికోట జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబరు 84 లో పలు సూచనలు చేసింది. కొండాపురం సమీపంలోని గండికోట జలాశయంలో నిత్యం నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 1000 గ్యాలెన్లకు ఐదు రూపాయల యాభై పైసలు చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె ఏపీ హై గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏపీహెచ్జీఎస్ఎల్) పేరిట ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ కన్య తీర్థం వద్ద శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం 3 వేల 148 ఎకరాలను కేటాయించింది.
ఉక్కు పరిశ్రమకు గండికోట నీళ్లు - gandikota water releases to steel plant at jammalamadugu in kadapa district
కడప జిల్లా జమ్మలమడుగులోని ఉక్కు పరిశ్రమ కోసం గండికోట జలాశయం నుంచి రెండు టీఎంసీల నీరు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు కొండాపురం సమీపంలో గండికోట జలాశయంలో నిత్యం నీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉక్కు పరిశ్రమకు గండికోట నీళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు