వారసత్వ ఉత్సవాలకు ముస్తాబవుతున్న గండికోట కడప జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యటక కేంద్రమైన గండికోటలో వారసత్వ ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల11,12 తేదీల్లో గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కడప, పులివెందులలో శోభాయాత్రతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రదర్శనల్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కింగ్స్ యునైటెడ్ బృందం సందడి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బైక్ ర్యాలీ...
మద్దతుగా భారీ బైక్ ర్యాలీ ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే గండికోట ఉత్సవాలను విజయంతం చేయాలని కడప జాయింట్ కలెక్టర్ శివారెడ్డి పిలునిచ్చారు. రహదారి భద్రతా వారోత్సవాలు, గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీవో కార్యలయం నుంచి వందలాది మంది యువకులతో ప్రారంభంమైన బైక్ ర్యాలీ పట్టణ రహదారుల మీదుగా జమ్మమలడుగు మీదుగా గండికోటకు వరకు సాగింది. ఏటా నిర్వహించే గండికోట ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి:
మెుదలైన గండికోట శోభాయాత్ర