ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేసవి వచ్చినా... అక్కడ నీటి ఎద్దడి ఉండదు..! - జమ్మలమడుగులోని రాయల చెరువు

ఎండాకాలం వచ్చిందంటే చాలు... గుక్కెడు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చేది. రాయలసీమ జిల్లాల్లో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరుకుంటుంది. అదే సీమలోని ఒక ప్రాంతంలో మాత్రం... ఎంత కరవొచ్చినా సరే నిత్యం నీరు అందుబాటులో ఉంటుంది. సుమారు 869 ఏళ్ల చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. అదే ప్రముఖ పర్యటక కేంద్రం గండికోటలోని రాయల చెరువు. ఈ చెరువు నేటికీ నీటితో కళకళలాడుతూ... అప్పటి పాలకుల దూరదృష్టికి అద్దం పడుతోంది.

gandikota-royal-pond
గండికోటలోని రాయల చెరువు

By

Published : Feb 2, 2020, 4:43 PM IST

వేసవి వచ్చినా... అక్కడ నీటి ఎద్దడి ఉండదు..!

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పర్యటక ప్రాంతం గండికోట ఆగ్నేయంలో... కోటగోడ వద్ద రాయల చెరువు ఉంది. ఈ చెరువును పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించారు. అందుకే ఈ చెరువును రాతి చెరువు, రాజుల చెరువు, రాయల చెరువు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. యుద్ధ సమయంలో కోటలో నెలల తరబడి ఉండే రాజు, అతని పరివారానికి ఈ చెరువే నీటి అవసరాలను తీర్చేది.

ఈ చెరువు నుంచి జుమ్మా మసీదు వరకు నీరు సరఫరా అయ్యేది. రాయల చెరువుకు తూర్పున ఉన్న నీటి గొట్టాల వ్యవస్థను... నేటికీ మనం చూడవచ్చు. కుతుబ్​షాహీ శైలిలోనే ఈ గొట్టాల వ్యవస్థ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి రాజులను స్ఫూర్తిగా తీసుకొని... ప్రభుత్వాలు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి...పోలవరానికి నిధులెలా?.. బడ్జెట్‌లోనూ మొండి చెయ్యి

ABOUT THE AUTHOR

...view details