కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహం కార్యాలయానికి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నరసింహులు అనే వ్యక్తి గుడారం వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ గుడారానికి విద్యుత్ మీటర్ని కూడా బిగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ రాజశేఖర్ తన సిబ్బందితో వెళ్లి గుడారాన్ని తొలగించి బండిపై వ్యాపారం చేసుకోవాలని తెలిపారు.
పెట్రోల్ పోసుకుని పండ్ల వ్యాపారి ఆత్మహత్యాయత్నం - fruit seller suicide news in kadapa dst
రహదారి పక్కన తాత్కాలిక గుడారం వేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిని.. ఆ కట్టడాన్ని తొలగించమని పురపాలక అధికారులు సూచించగా ఆ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.
fruit seller commite suicide attempt with petrol in kadapa dst rajampeta
మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నా..ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా వ్యాపారి సిబ్బందితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పెట్రోల్ని ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పట్టణ ప్రణాళిక అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని తొలగించేశారు.