కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట కు చెందిన సుధీర్... ఆదివారం సాయంత్రం గ్రామంలోని టీ స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న సుధీర్ స్నేహితులు బండి కిషోర్ తో పాటు మరో ముగ్గురు... గతంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని సుధీర్‌ను కొట్టారు. అనంతరం వాహనంలో ఉన్న పెట్రోల్ తీసి సుధీర్‌పై చల్లి, నిప్పంటించారు. తీవ్రగాయాలైన సుధీర్‌ను అతని స్నేహితులే మైదుకూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి... పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు.
బాలుడి పై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో నలుగురిపై కేసు - crime news in kadapa district
కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప అదనపు ఎస్పీ దేవప్రసాద్