ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుబ్బయ్య హత్య కేసు : పోలీసుల అదుపులో ఐదుగురు - kadapa district crime news

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.

five members of police hand over  on nandham subbaiah murder case in prodduturu kadapa district
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్

By

Published : Dec 31, 2020, 3:47 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరిని గురువారం సాయంత్రం మీడియా ఎదుట హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన ఏ1, ఏ2లకు, మృతునికి మధ్య మనస్పర్థలు ఉండేవని, వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details