కడప జిల్లా బద్వేలు, మైదుకూరు 67వ జాతీయ రహదారిపై టి. రామాపురం వద్ద ఈరోజు సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా వారి రెండేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు.
తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు... చిన్నారి సురక్షితం - accident
ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడగా... రెండేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు.
బి. కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్... భార్య శివమ్మ, రెండేళ్ల చిన్నారితో కలిసి ద్విచక్రవాహనంపై ఖాజీపేటకు కూలీ పనుల కోసం బయల్దేరారు. టి. రామాపురం గ్రామం వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్నటాటా సుమో వాహనం అదుపుతప్పి వీరిని ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వీరు అదుపు తప్పి కింద పడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే స్థానికులు ప్రత్యేక వాహనంలో లో కడప రిమ్స్ కు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదఘటనపై బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.