కడప ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తనిఖీలు - taaza news of kadapa district
అక్రమ మద్యం అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం అమ్మకాలపై ఆరా తీశారు.
కడప ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తనిఖీలు
కడప నగరంలోని ప్రభుత్వ అవుట్ లెట్ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు పలు దుకాణాలు తనిఖీ చేశారు. లాక్ డౌన్ తర్వాత నగరంలో పలు మద్యం దుకాణాల్లో అక్రమంగా మద్యం విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా అవుట్ లెట్ మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు ఏ మేరకు జరిగాయని అధికారులు అరా తీశారు. సమగ్ర నివేదికను ఇవాళ జిల్లా కలెక్టర్ కు అందజేసే అవకాశం ఉంది.