ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నన్ను మోసం చేశారు.. అందుకే వైకాపాను గెలిపించా' - Veera Siva reddy to join in YCP

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెదేపాను వీడి... వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని చెప్పి.. అధిష్టానం మాట తప్పిందని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

By

Published : Jul 28, 2019, 8:52 PM IST

మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి.... తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో వీరశివారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని ఇప్పటికే తెదేపా అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ తనకు ఇస్తానని చెప్పి... చివరి నిమిషంలో చంద్రబాబు మాటమార్చారని ఆరోపించారు. ఈ కారణంగానే తాను... తన కేడర్... వైకాపా గెలుపు కోసం కృషి చేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్... విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం వైకాపాలో చేరుతున్నట్లు వీరశివారెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details