మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన తప్పు ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా ఉరి తీయవచ్చని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వివేకానంద రెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు.
సీఎం జగన్ కుటుంబసభ్యులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీబీఐ కార్యాలయం ఎదుట జగన్ కుటుంబసభ్యులు, తమ కుటుంబసభ్యులు ధర్నాకు కూర్చోవాలని సవాల్ చేశారు. విచారణ పూర్తయిన తర్వాత తప్పు తమదని తెలిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.