ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టువదలని రాహుల్... చివరి ప్రయత్నంలో సివిల్స్ సాధించెన్​

సివిల్స్ రాసే వారు మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినా నిరుత్సాహపడొద్దని 117 వ సివిల్స్ ర్యాంకర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో చేసిన తప్పులు చేయకుండా... ప్రణాళికతో కష్టపడి చదివితే సివిల్ సాధించటం పెద్ద కష్టమైన పనేమి కాదని చెప్పారు. చివరి ప్రయత్నంలో సివిల్స్ సాధించిన రాహుల్ కుమార్ రెడ్డి ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

etv-bharat
etv-bharat

By

Published : Aug 5, 2020, 6:14 PM IST

Updated : Aug 5, 2020, 7:05 PM IST

ఏకాగ్రత... పట్టుదల.. మొక్కవోని ఆత్మవిశ్వాసం.. ప్రణాళికతో కష్టపడి చదివితే సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు 117వ సివిల్ ర్యాంకర్ తాటిమాకుల రాహుల్ కుమార్ రెడ్డి. కడపజిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ రెడ్డిది వ్యవసాయాధారిత కుటుంబం. 2012లో బీటెక్ పూర్తయినప్పటి నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ... చివరి ప్రయత్నంగా ర్యాంకు సాధించారు రాహుల్.

సివిల్స్ ర్యాంకర్ రాహుల్ కుమార్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకుండా... ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కు కూడా నోట్స్ రాసుకుంటూ సాధన చేశానని అంటున్నారు. ఎక్కువగా జాతీయ, స్థానిక పత్రికలతో పాటు "ఈనాడు ఎడిటోరియల్, ఈటీవీ"లో ప్రసారం అయ్యే ప్రతిధ్వని నిరంతరం ఫాలో అయ్యేవాడినని చెబుతున్నారు. 117వ ర్యాంకుతో కచ్చితంగా ఐఏఎస్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నానన్న రాహుల్... ఒకవేళ ఐపీఎస్ వచ్చినా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటానని అంటున్నారు.

Last Updated : Aug 5, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details