సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పులివెందులకు చేరుకున్న రిజర్వు ఎన్నికల సిబ్బంది...జేఎన్టీయూ కళాశాల బయట రోడ్డు మీద ధర్నా చేశారు. తమను విధులకు వేసి...రిజర్వులో ఉంచారని వారు ఆందోళన చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవర్తన సరిగ్గా లేదని...ఉదయం నుంచి ఇక్కడే వేచి ఉన్నా తీరా ఇప్పుడు రాత్రి 8 గంటలకు ..మీరు ఇళ్లకు వెళ్లి తిరిగి ఉదయం వచ్చి రిపోర్టు చేయమని చెప్తున్నారని వారు అన్నారు. ఈ సమయంలో మేం ఎక్కడికి వెళ్లి ఉండేదని, ఉదయం నుంచి కనీసం నీరు కూడా ఏర్పాటు చేయలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి వాహనాన్ని అడ్డుకోవడంతో ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని రవి కోరారు.
'విధులు వేశారు...రిజర్వులో ఉంచారు' - ఎమ్మెల్సీ బీటెక్ రవి
కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికల విధుల నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బందిని రిజర్వులో ఉంచటంతో వారు జేఎన్టీయూ కళాశాల బయట ధర్నా చేశారు.
ఎన్నికల సిబ్బంది ధర్నా
ఇవి చూడండి...