తమకు న్యాయం చేయాలని కోరుతూ గోపాలమిత్ర ఉద్యోగులు విధులను బహిష్కరించి అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టి వేరే వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామ సచివాలయంలో గోపాల మిత్రులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి నుంచి పని చేస్తున్న తమకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో గోపాలమిత్ర ఉద్యోగులకు అవకాశం కల్పించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని గోపాలమిత్ర ఉద్యోగులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కలెక్టరేట్ ఎదుట గోపాలమిత్రల అర్ధనగ్న ధర్నా - కడప కలెక్టరేట్
ఉద్యోగ భద్రత కల్పించాలని గోపాలమిత్ర ఉద్యోగులు కడప కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Employees of Gopalamithra protested in front of Kadapa Collectorate to ensure job security.