ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప ఈ దర్శన్ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఆందోళన - కడపలో ఈ దర్శన్ కేంద్రం సిబ్బంది నిరసన

కడప నగరంలో ఈ దర్శన్ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఆందోళన చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ దర్శన్ కేంద్రాలను..తన కుమారుడు సీఎం జగన్ మూసివేసేదిశగా ఆలోచిస్తున్నారని వాపోయారు.

e darshan  employees protest at kadapa
కడపలో ఈ దర్శన్ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఆందోళన

By

Published : Jul 9, 2020, 4:35 PM IST

కడప నగరంలో ఈ దర్శన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు కొన్నేళ్ల నుంచి ఈ దర్శన్ కేంద్రాల్లో పనిచేస్తున్నామని... కేవలం 7వేల రూపాయలతో విధులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ దర్శన్ కేంద్రాలు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉపయోగపడుతాయని వారు తెలిపారు. వాటిని రద్దు చేయడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు స్వామివారి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details