తాగడానికి నీరు లేక గోపాలపురం గ్రామస్థులు.. మండల కేంద్రమైన కమలాపురం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇంట్లోని అవసరాలకు పొలాల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పనులకు వెళ్లాల్సిన వాళ్లు.. నీటి కోసమే ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తోంది. కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వరకు ఉండే తాగునీటి పైప్లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య వచ్చిందంటున్నారు. అధికారులు త్వరంగా మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మూడు రోజుల నుంచి రాని తాగునీరు..ప్రజలకు తప్పని అవస్థలు - కడప జిల్లా గోపాలపురంలో నీటి సమస్య న్యూస్
కడప జిల్లా కమలాపురం మండలం గోపాలపురం గ్రామంలో మూడు రోజుల నుంచి నీరు రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. తాగునీరు లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.
మూడు రోజుల నుంచి తాగునీరు లేక అవస్థలు