ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలుషిత నీటితో ప్రజల ఇబ్బందులు - kadapa

కడప జిల్లా గంగిరెడ్డిపాలెం ప్రజలు కలుషితమైన తాగునీటితో ఇబ్బంది పడుతున్నారు. అడపాదడపా వచ్చే నీరు కాస్తా దుర్గంధభరితంగా ఉంటోందంటూ స్థానికులు వాపోతున్నారు.

తాగునీరు

By

Published : Jul 12, 2019, 10:32 PM IST

కలుషిత నీటితో ప్రజల ఇబ్బందులు

రోజుల తరబడి తాగునీరు రావడం లేదని.... అడపాదడపా వచ్చిన ఆ చుక్కనీరు కాస్తా దుర్వాసన వస్తోందని కడప జిల్లా రాజంపేటలోని గంగిరెడ్డిపాలెం స్థానికులు వాపోతున్నారు. ఆ నీటిని తాగలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా తాగునీరు అందించే పైప్ లైన్లు మురుగునీటి కాల్వలో ఉండటం, పైప్​లైన్ పగిలి నీరు మురుగు కాలువలో కలుస్తున్న కారణంగా... తాగునీరు కలుషితం అవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటిని కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకూ వినియోగించుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. గ్రామ ప్రజలు శుక్రవారం పురపాలక కమిషనర్ శ్రీహరి బాబును కలిసి సమస్యను విన్నవించారు. వారం రోజులుగా చుక్క నీరు రాలేదన్నారు. స్పందించిన కమిషనర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details