పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ - Distribution of packets of rice
కడప జిల్లా యర్రగుంట్లలో పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నాయకులు బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ తగుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ.
కడప జిల్లా యర్రగుంట్ల నగరపంచాయతీలో వైకాపా నాయకులు జయశంకర్రెడ్డి, మూల సురేంద్రరెడ్డి... పారిశుద్ధ్య కార్మికులకు 25 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు సహాయం చేశారు. ఇళ్లల్లో నుంచి బయటకు ఎవరు రావద్దని... కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.