కడప జిల్లా జమ్మలమడుగులో ఓ వ్యక్తి ఉచితంగా మాస్కులను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు నూకల లక్ష్మీనారాయణ తెలిపారు. మొత్తం ఐదు వేల మాస్కులను కుట్టించి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జమ్మలమడుగు పాత బస్టాండ్లో మాస్కులను తగిలించి ప్రయాణికులకు అందజేస్తున్నారు. భాజపా కార్యకర్త లక్ష్మీనారాయణ ఓ ముస్లిం టైలరు సహాయంతో వాటిని కుట్టించి ప్రతిరోజూ అందజేస్తున్నారు. ఇంటినుంచి బయటికి వచ్చిన ప్రజలు పొరపాటుగా మాస్కులు మరిచిపోయిన వారు, ప్రయాణికులు వీటిని తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
జమ్మలమడుగులో ఉచితంగా మాస్కుల పంపిణీ - ఉచితంగా మాస్కుల పంపిణీ
జమ్మలమడుగులో ఓ వ్యక్తి ఉచితంగా మాస్కులను పంపిణీ చేస్తున్నారు. ఐదు వేల మాస్కులు కుట్టించి పంపిణి చేస్తున్నట్లు నూకల లక్ష్మీనారాయణ తెలిపారు.
ఉచితంగా మాస్కుల పంపిణీ